కోడెల కుమారుడికి రూ.కోటి ఫైన్

కోడెల కుమారుడికి రూ.కోటి ఫైన్
x
Highlights

కోడెల కుమారుడికి రూ.కోటి ఫైన్ కోడెల కుమారుడికి రూ.కోటి ఫైన్

మాజీ స్పీకర్, దివంగత నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం నిర్వహిస్తోన్న గౌతమ్ హోండా షోరూంకు భారీ జరిమానా విధించారు రవాణా శాఖ అధికారులు. నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు జరిపారని.. దాదాపు 40 వేల టూ వీలర్‌ వాహనాలకు పన్నులు ఎగవేసినట్టు అధికారులు గుర్తించారు. దీంతో విచారించిన అధికారులు అధికారులు గౌతమ్ హోండా షోరూంకు భారీ ఫైన్ విధించారు.మొత్తం కోటి రూపాయల చెల్లించాలని ఆదేశించారు. ఆర్టీఏ రూల్స్ ఉల్లంఘించి టూ వీలర్స్ అమ్మకాలు జరిపినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీఏ విధించిన రూ.కోటి జరిమానాను చెల్లించడానికి శివరామ్ సైతం అంగీకరించినట్టు సమాచారం. రెండు రోజుల్లోగా కోటి రూపాయల మొత్తాన్ని చెల్లించనున్నట్టు కోర్టుకు తెలిపారు శివరాం.

కాగా గౌతమ్ హీరో హోండా షోరూంలో టెంపరరీ రిజిస్ట్రేషన్ అనుమతి లేకుండా కొత్త బైక్‌లు డెలివరీ చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. అయితే గతంలో వీటిపై అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో పెండింగ్ ఫిర్యాదులపై దృష్టిసారించింది రవాణా శాఖా. దీంతో ఈ షోరూంలో భారీగా అవకతవకలను గుర్తించింది. కేవలం 2018 లోనే టీఆర్‌ లేకుండా 1,025 బైక్‌లు విక్రయించినట్లు విచారణలో గుర్తించారు. టీఆర్, లైఫ్‌ ట్యాక్స్, శాశ్వత రిజిస్ట్రేషన్‌ తదితర ఫీజుల కింద ఒక్కో బైక్‌కు సగటున రూ.8వేల చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేసిన శివరామ్‌ ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించలేదని తేలింది. దీంతో 1989 కేంద్ర మోటర్‌ వాహన చట్టం నిబంధన 42 కింద షోరూంపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు కోడెల శివరామ్‌పై ఐపీసీ 406, 409, 420, 468, 471 సెక్షన్‌ల కింద నమోదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories