కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె

కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గురువారం కోర్టులో లొంగిపోయారు. ఉద్యోగాల పేరుతో రూ. లక్షలు వసూలు చేసి కొందరు...

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గురువారం కోర్టులో లొంగిపోయారు. ఉద్యోగాల పేరుతో రూ. లక్షలు వసూలు చేసి కొందరు వ్యక్తులను మోసం చేశారని ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదయింది. ఈ విషయంలో కోర్టుకు హాజరయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆమెకు రెండు కేసుల్లో బెయిల్‌ మంజూరు అయింది. ప్రతి ఆదివారం వన్‌టౌన్‌, టూటౌన్‌ స్టేషన్‌లలో సంతకం చేయాలని.. 1వ అదనపు జిల్లా మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విజయలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories