Gudivada: ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ

Gudivada: ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ
x
Highlights

రాష్ట్రంలో అర్హులైన పేదప్రజలకు వచ్చే ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల పట్టాలు కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు

గుడివాడ: రాష్ట్రంలో అర్హులైన పేదప్రజలకు వచ్చే ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల పట్టాలు కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో రైలు పేట కు చెందిన చల్ల ఆదిలక్ష్మి మంత్రి కొడాలి నాని కలిశారు. ఈ సందర్భంగా తనకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని ఇప్పించాలని కోరింది దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు మంజూరు చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారన్నారు.

దీనిలో భాగంగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ప్రభుత్వం భూములు చాలకపోతే ఇంకా అవసరమైన మేర ప్రైవేట్ భూములను భూసేకరణ చేశామన్నారు. ప్రైవేట్ భూములను ఈ నెల 15వ తేదీలోగా అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వ భూములు ప్లాట్లను ఈనెల 25వ తేదీలోగా అభివృద్ధి పనులను పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేస్తామని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆడపా బాబ్జి, మాజీ కౌన్సిలర్ పొట్లూరి వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories