నానీలు సెట్ అవుతున్నారా..? అసంతృప్తి పోయినట్టేనా...? అదే దూకుడు కొనసాగిస్తారా..?

Kodali Nani Perni Nani Reaction on AP New Cabinet | YS Jagan | AP Live News
x

నానీలు సెట్ అవుతున్నారా..? అసంతృప్తి పోయినట్టేనా...? అదే దూకుడు కొనసాగిస్తారా..?

Highlights

AP News: *నానీల మౌనంపై పార్టీలో అంతర్గత చర్చ *టీడీపీపై కొడాలి నాని మళ్లీ అటాకింగ్

AP News: వైసీపీలో మొన్నటి వరకు ముగ్గురు నానీల హవా కొనసాగింది. ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు కొడాలి నాని, పేర్ని నాని. ఫైర్ బ్రాండ్‌ లా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఒంటి కాలిమీద లేశారు. మంత్రి వర్గంలో కొనసాగింపు లేకపోవడంతో ఇద్దరు నానిలు కొంత అసంతృప్తికి లోనయ్యారు. మాజీ మంత్రులైన వారిద్దరు ముందు ముందు ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న కొడాలి నాని జగన్ నాయకత్వంపై ధీమా వ్యక్తం చేశారు.

తనకు మాజీ మంత్రి కంటే ఎమ్మెల్యే అని పిలవటం ఇష్టమన్నారు. కొడాలి నాని మళ్లీ టీడీపీపై అటాకింగ్‌కు దిగారు. ఇక మరో మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. పార్టీ బలోపేతంపై పేర్ని నాని ఫోకస్ పెట్టారు. అయితే..నానీల ద్వయం మునుపటి దూకుడు కొనసాగిస్తారా...? అనేది చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories