కోడెల ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు..20రోజులుగా..

కోడెల ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు..20రోజులుగా..
x
Highlights

కోడెల సూసైడ్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 20రోజుల క్రితం హైదరాబాద్‌కి వచ్చిన కోడెల అప్పట్నుంచి ఇంటి నుంచి బయటికి రాకుండా...

కోడెల సూసైడ్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 20రోజుల క్రితం హైదరాబాద్‌కి వచ్చిన కోడెల అప్పట్నుంచి ఇంటి నుంచి బయటికి రాకుండా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలిసింది. ముందుగా తాను కట్టుకున్న పంచెతో ఉరివేసుకునేందుకు ప్రయత్నించిన కోడెల కుదరకపోవడంతో ఆ తర్వాత కేబుల్ వైర్‌‌తో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఇదిలాఉంటే, నర్సరావుపేటలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం సేకరించారు. అయితే, అప్పుడు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఇక కోడెల కేసులో భార్య, కూతురు, డ్రైవర్‌, గన్‌మన్‌‌ను సాక్షులుగా చేర్చిన పోలీసులు త్వరలోనే కొడుకు శివరామ్‌‌ను ప్రశ్నించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories