విజయసాయిపై వెలగపూడి వ్యాఖ్యలు దారుణం: కేకే రాజు

విజయసాయిపై వెలగపూడి వ్యాఖ్యలు దారుణం: కేకే రాజు
x
Highlights

* విశాఖ అభివృద్ధే లక్ష్యంగా విజయసాయి కృషి చేస్తున్నారు * జగన్‌, విజయసాయిపై విమర్శలు చేసే అర్హత వెలగపూడికి లేదు * ప్రతి పేదవాడి సొంతింటి కలను జగన్‌ నిజం చేస్తారు

ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త కేకే రాజు. విశాఖ అభివృద్ధే లక్ష్యంగా అణుక్షణం విజయసాయి కృషి చేస్తున్నారన్నారు. రంగా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వెలగపూడికి.. సీఎం జగన్‌, విజయసాయిపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు.

బడుగు బలహీలన వర్గాలు, మహిళలు, యువత అభ్యున్నతికి జగన్‌ కృషి చేస్తున్నారని.. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. విశాఖలో పరిపాలన రాజధాని కోసం ప్రభుత్వ భూమిని ఉపయోగించాలనే నిర్ణయంతో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు కేకే రాజు.

Show Full Article
Print Article
Next Story
More Stories