Kadapa: స్నేహితుడిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘనుడు.. తల్లి నిలదీయంతో విషయం వెలుగులోకి..

Kills His Friend Buries The Dead Body In His Own House
x

Kadapa: స్నేహితుడిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘనుడు.. తల్లి నిలదీయంతో విషయం వెలుగులోకి..

Highlights

Kadapa: నెల రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి ఇంటికి వచ్చిన కిషోర్ తల్లి

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. కిషోర్ అనే వ్యక్తి స్నేహితుడిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. నెల రోజుల క్రితం కిషోర్, సతీశ్ గొడవపడినట్లు తెలుస్తోంది. ఈ గొడవలోనే కిషోర్ సతీశ్‌ను హత్య చేసి ఉంటాడని స్థానికులు అంటున్నారు. నెల రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి ఇంటికి వచ్చిన కిషోర్ తల్లి ఇంట్లో దుర్వాసన రావడంతో కిషోర్‌ను ప్రశ్నించింది. దీంతో సతీశ్‌ను హత్య చేసిన పూడ్చిపెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories