ఈనెల 28న వైసీపీలో చేరుతున్నా : కేంద్ర మాజీ మంత్రి

ఈనెల 28న వైసీపీలో చేరుతున్నా : కేంద్ర మాజీ మంత్రి
x
Highlights

మంగళవారం కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. ఆ తరువాత ఆమె తన...

మంగళవారం కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. ఆ తరువాత ఆమె తన కార్యకర్తలతో లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ... ఈనెల 28న అమరావతిలో జరిగే కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. బీసీ గర్జనలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను పూర్తిగా విశ్వసిస్తున్నానన్నారు. చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేస్తారు.. వైఎస్‌ జగన్ మాట తప్పరు, మడమ తిప్పరని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారని, ఏపీ ప్రజలు ఆయన మాటలు నమ్మరని చెప్పారు. కాగా తాను టికెట్ కోసం కాకుండా బేషరతుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కృపారాణి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories