తిరుమలలో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం

Kidnapped Boy Found in Tirumala | Telugu News
x

తిరుమలలో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం

Highlights

Tirumala: మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం

Tirumala: తిరుమలలో కిడ్నాప్ అయినా బాలుడు ఆచూకీ లభ్యమైంది. మూడు రోజుల క్రితం శ్రీవారి ఆలయం ముందు బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. దీంతో బాలుడి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బాలుడిని గుర్తుతెలియని మహిళ మైసూరుకు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్‌ చేసిన మహిళ కర్నాటకకు చెందిన పవిత్రగా తేల్చారు. అయితే మహిళకు మతిస్థిమితం లేదని పోలీసులు చెబుతున్నారు. పవిత్ర తల్లిదండ్రులే బాలుడిని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక బాలుడిని తిరుమల కమాండ్‌ కంట్రోల్ రూమ్‌కు తరలించారు. అనంతరం అతడి తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. మరోవైపు కిడ్నాపర్‌ పవిత్రపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories