Viveka Murder Case: వివేకా హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు

Key Points in the Charge Sheet of the Viveka Murder Case
x

Viveka Murder Case: వివేకా హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు

Highlights

Viveka Murder Case: కుట్ర, సాక్ష్యాల చెరిపివేత గురించి వివరించిన సీబీఐ

Viveka Murder Case: వివేకా హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలను ప్రస్తావించింది సీబీఐ. గత నెల 30న సీబీఐ సమర్పించిన ఛార్జ్‌షీట్‌ను ఇవాళ హైకోర్టు స్వీకరించింది. హత్యకు చేసిన కుట్ర, సాక్ష్యాల చెరిపివేత గురించి వివరించింది. ఫోటోలు, గూగుల్‌ టేకవుట్, ఫోన్ లొకేషన్ల డేటాలను కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని ఛార్జ్‌షీట్‌లో అభియోగాలు మోపింది. వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలున్నా.. ఆధారాలు లభించలేదని తెలిపింది.

సాక్ష్యాల చెరిపివేత సమయంలో వైఎస్‌ మనోహర్ రెడ్డి ఉన్నా.. ఆయన ప్రమేయం నిర్ధారణ కాలేదంది. ఇక వివేకా ఇంట్లో వైఫైకి కనెక్ట్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నామని కోర్టుకు వివరించింది సీబీఐ. వివేకా లేఖను ఇప్పటికే నిన్‌ హైడ్రిన్ పరీక్షకు పంపగా.. అందుకు సంబంధించిన నివేదిక రావాల్సి ఉందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ నివేదికలు కూడా త్రివేండ్రం సీడాక్ నుంచి అందాల్సి ఉన్నాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories