విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు

Key Evidence In The Visakha Fishing Harbor Fire Case
x

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు

Highlights

Visakha Fishing Harbour: మద్యం మత్తులో నాని తప్పిదం కారణంగానే ఘటన జరిగినట్టు పోలీసుల అనుమానం

Visakha Fishing Harbour: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. అగ్నిప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీని విడుదల చేశారు. మద్యం మత్తులో నాని తప్పిదం కారణంగానే ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి 10 గంటల 49 నిమిషాలకు ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి హడావుడిగా ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారు. రాత్రి 10 గంటల 50 నిమిషాలకు అగ్నిప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజీలో అగ్నిప్రమాదం జరగక ముందే హార్బర్‌లో నాని ఉన్నట్టు గుర్తించారు. అయితే.. అగ్నిప్రమాదం జరిగిందని తెలిసి ఘటనాస్థలానికి వచ్చానని నాని అంటున్నాడు. ఇప్పుడు పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజీ.. ఈ కేసులో కీలకంగా మారనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories