AP Cabinet: ఏపీ కేబినెట్‌‌లో కీలక నిర్ణయాలు.. ఆరోగ్యశ్రీని రూ. 25 లక్షలకు పెంచేందుకు కేబినెట్‌ ఆమోదం

Key Decisions in AP Cabinet
x

AP Cabinet: ఏపీ కేబినెట్‌‌లో కీలక నిర్ణయాలు.. ఆరోగ్యశ్రీని రూ. 25 లక్షలకు పెంచేందుకు కేబినెట్‌ ఆమోదం

Highlights

AP Cabinet: ఈ నెల 18 నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ

AP Cabinet: ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్‌.. పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడుతకు ఆమోదం తెలిపిన క్యాబినెట్. ఆరోగ్య శ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశంలోనే చారిత్రాకమైనది మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేపట్టనున్నట్టు తెలిపారు. పేదవాడికి ఉచితం వైద్యం అందించే గొప్ప పథకమని ఆయన అన్నారు.

ఇప్పటికే క్యాన్సర్ వంటి రోగాలకు లిమిట్ లేకుండానే 27 లక్షల వరకూ ఇచ్చిన ఘనత తమదేన్నారు. పేదవాడు పేదరికానికి భయపడకుండా వైద్యం పొందే అవకాశమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కొనియాడారు. కాగా.. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories