పోలవరం ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. రూ.55 వేల 548.87 కోట్ల..

పోలవరం ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. రూ.55 వేల 548.87 కోట్ల..
x
Highlights

ఆంద్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ ఆమోదం...

ఆంద్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది. 2017-18 ధరల ప్రకారం అంచనాలకు సీడబ్ల్యూసీ సలహా కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర జలవనరుల శాఖ పంపిన రూ.55 వేల 548.87 కోట్ల రూపాయలకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది.

పలుమార్లు ఈ అభ్యర్ధనను తిరస్కరించిన సాంకేతిక సలహా మండలి... చివరికి రాష్ట్రం ఇచ్చిన మొత్తానికే ఆమోద ముద్ర వేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర జల వనరులశాఖ ఇచ్చిన లెక్కలు సహేతుకమైనవేనని స్పష్టమైంది. రాష్ట్ర అధికారులు ఇచ్చిన వివరణతో టీఏసీ సంతృప్తి చెందడంతో కేవలం గంటలోనే ఈ సమావేశం ముగిసింది. ఇక కేంద్ర కేబినెట్‌లో ఆమోదముద్ర వేయటమే తరువాయి. ఇందుకోసం రాష్ట్ర అధికారులు కార్యాచరణను కూడా సిద్ధం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories