ఉయ్యూరు శివాలయంలో విరిగిన కేతువు విగ్రహం : రహస్యంగా ఉంచిన అధికారులు

* నవగ్రహాల ఆలయంలో ఘటన * గత 2 నెలల క్రితం జరిగిన ఘటన: అర్చకుడు * గోప్యంగా ఉంచిన అధికారులు

Sandeep Eggoju
Updated on: 3 Jan 2021 2:56 PM IST
ఉయ్యూరు శివాలయంలో విరిగిన కేతువు విగ్రహం :  రహస్యంగా ఉంచిన అధికారులు
X

ఏపీలో దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని వెలుగులోకి వస్తూనే ఉన్నాయి మరికొన్ని రహస్యంగా దాచిఉంచుతున్నారు. కృష్ణాజిల్లా ఉయ్యూరు శివాలయంలో రెండు నెలల క్రితం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కడి కేతువు విగ్రహం విరిగిపోయింది. అయితే విగ్రహం కూల్చిన విషయాన్ని దేవస్థాన అధికారులు గోప్యంగా ఉంచారు. మరో విగ్రహం తయారీకి తెనాలిలో ఆర్డర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 8న విగ్రహ పున:ప్రతిష్టకు రహస్య ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆలయం దగ్గరకు చేరుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story