శ్రీశైల క్షేత్రంలో ఘనంగా కార్తీక మాసోత్సవాలు

శ్రీశైల క్షేత్రంలో ఘనంగా కార్తీక మాసోత్సవాలు
x
Highlights

* మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు * ఉదయం 4.30లకు ప్రారంభమైన దర్శనాలు * సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం

కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పౌర్ణమి ఘడియల్లో మూడవ కార్తీక సోమవారం రావడంతో శ్రీశైల శైవ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నాలుగున్నర గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలు కల్పించనున్నారు. 5 విడతలుగా అర్జిత సేవలు నిర్వహించనున్నారు.

భక్తులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆలయ ఈవో కె.ఎస్. రామారావు తెలిపారు. కార్తీక సోమవారం కావడంతో ఇవాళ సాయంత్రం ఆలయ పుష్కరిణీ దగ్గర లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు. పుష్కరిణి హారతి గంగాధర మండప నాగుల కట్ట దగ్గర పుర వీధుల్లో భక్తులు కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories