ఈనెల 16 నుంచి కార్తీకమాసం ప్రారంభం..ఆలయాల్లో ఏర్పాట్లు శూన్యం!

ఈనెల 16 నుంచి కార్తీకమాసం ప్రారంభం..ఆలయాల్లో ఏర్పాట్లు శూన్యం!
x
Highlights

కొద్దిరోజుల క్రితమే జరిగిన అట్లతద్ది రోజున మహిళలు పెద్ద సంఖ్యలో గోదావరి రేవులకు వచ్చి పుణ్యస్నానాలు చేశారు. ఆ నేపధ్యం చూసినట్లయితే కోవిడ్ భయం ఉన్నప్పటికీ, భక్తిభావంతో పుణ్యస్నానాలకు భక్తులు వస్తారని అర్ధమైంది.

కార్తీక మాసం నేపధ్యంలో ముందుగానే రాజమండ్రి గోదావరి రేవులలో ఏర్పాట్లను చేస్తుంటారు. కానీ ఈసారి కార్తీక మాసం ముహూర్తం దగ్గర పడుతున్నా దేవాదాయశాఖాధికారులు, మునిసిపల్, రెవిన్యూ అధికారులు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు మొదలు పెట్టకపోవడంతో భక్తులలో ఆందోళన నెలకొంది.

కార్తీకమాసంలో తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన ఆలయాలకి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వెళుతుంటారు. ఈ సందర్భంగా రేవులలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేయాల్సివుంటుంది. అలాగే భక్తులకు మంచినీరు, రేవులలో చెత్తను శుభ్రం చేసి పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపడతారు. అయితే ఇంత వరకు అధికారులెవ్వరూ ఈ పనులను చేపట్టలేదు. కోవిడ్ నేపధ్యంలో ఏర్పాట్లు చేయడం లేదా.. లేకుంటే భక్తులు ఎక్కువగా రాకుండా వుండేందుకు ఏర్పాట్లు చేయడం లేదా అన్నది తెలియడం లేదు.

కొద్దిరోజుల క్రితమే జరిగిన అట్లతద్ది రోజున మహిళలు పెద్ద సంఖ్యలో గోదావరి రేవులకు వచ్చి పుణ్యస్నానాలు చేశారు. ఆ నేపధ్యం చూసినట్లయితే కోవిడ్ భయం ఉన్నప్పటికీ, భక్తిభావంతో పుణ్యస్నానాలకు భక్తులు వస్తారని అర్ధమైంది.

అయితే కరోనా నిబంధనలు పాటించి స్నానాలు చేయాలని, ఆలయాలలో దర్శనం, స్నానాలు చేసినప్పుడు సామాజిక దూరం పాటించాలని పురోహితులు మరీమరీ చెబుతున్నారు. నీరు కలుషితం వల్ల అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయని అర్చకులు చెబుతున్నారు. ఏది ఏమైనా భక్తులందరూ ఎంతో పుణ్య రోజులుగా భావించే కార్తీకమాసంలో గోదావరి రేవులు, ఆలయాలలో దర్శన ఏర్పాట్లు, కరోనా కేసులు నేపధ్యంలో తగిన వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారయంత్రాంగంపై వుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories