17 మందితో కర్ణాటక మంత్రివర్గం ఏర్పాటు

17 మందితో కర్ణాటక మంత్రివర్గం ఏర్పాటు
x
Highlights

ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశాక కర్ణాటకలో మంత్రివర్గ ఏర్పాటుకు దాదాపు నెలరోజులు పట్టింది. ఇవాళ యడియూరప్ప కేబినెట్ కొలువు దీరింది. కొత్త...

ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశాక కర్ణాటకలో మంత్రివర్గ ఏర్పాటుకు దాదాపు నెలరోజులు పట్టింది. ఇవాళ యడియూరప్ప కేబినెట్ కొలువు దీరింది. కొత్త మంత్రివర్గంలో 17 మందికి అవకాశం కల్పించారు. ప్రధానంగా లింగాయత్, ఒక్కళిగ, ఎస్సీ-ఎస్టీ, కురుబ, బ్రాహ్మణ, బిల్లవ వర్గాలకు కేబినెట్‌లో చోటు కల్పించారు. లింగాయత్‌ వర్గానికి 5 మంత్రి పదవులు, మరో ప్రధాన వర్గం ఒక్కళిగలకు 4 కేబినెట్ పోస్టులు లభించాయి. ఎస్సీ-ఎస్టీలకు చెరో మూడు మంత్రి పదవులు ఇచ్చారు.

వీరే మంత్రులు..

సోమన్న రవి, బసవరాజు, నివాస్‌ పుజారి, మధుస్వామి, చిన్నప్పగౌడ, నగేష్‌, ప్రభు చవాన్‌, శశికళ, అన్నాసాహెబ్‌, గోవింద్‌, అశ్వస్థ నారాయణ్‌, ఈశ్వరప్ప, అశోక్‌, జగదీష్‌ షెట్టర్‌, శ్రీ రాములు, సురేష్‌ కుమార్‌, చంద్రకాంత్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories