సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కాపుసేన

సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కాపుసేన
x
బండారు నారాయణమూర్తి
Highlights

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఏర్పాటు చెయ్యాలన్న ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపుసేన మద్దతు పలికింది.

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఏర్పాటు చెయ్యాలన్న ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపుసేన మద్దతు పలికింది. విశాఖపట్నం కేంద్రం రాజధానిని స్వాగతించారు కాపుసేన గౌరవ అధ్యక్షుడు బండారు నారాయణమూర్తి, అధ్యక్షుడు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి లంకా భాస్కరరావు, గంట్ల శ్రీనుబాబు. ఈ మేరకు వారు విశాఖలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. సీఎం తీసుకోబోయే ఈ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంలోనే ఉందని అన్నారు.

ఇకనుంచి ఉత్తరాంధ్రకు మంచిరోజులు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం రాజధానిని ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేకంగా అభివృద్ధి చెయ్యాలని సూచించారు. అభివృద్ధి లేకనే ఇక్కడి ప్రజలు అనేక ప్రాంతాలకు వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటయితే ముంబాయిని మించి మహానగరంగా అభివృద్ధి చెందుతుందని జోశ్యం చెప్పారు. రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ విశాఖకు రావడానికి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం జగన్‌ దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారని.. ఉత్తరాంధ్ర ప్రజలు జీవితాంతం జగన్‌కు రుణపడి ఉంటారని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories