జగన్ కు రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం లేదు: కన్నాలక్ష్మీనారాయణ

జగన్ కు రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం లేదు: కన్నాలక్ష్మీనారాయణ
x
Highlights

రాజధానిపై వేసిన కమిటీలన్నీ జగన్ మానసపుత్రికలే అని వ్యాఖ్యానించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ.

రాజధానిపై వేసిన కమిటీలన్నీ జగన్ మానసపుత్రికలే అని వ్యాఖ్యానించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చెప్పిందే జీఎన్ రావు కమిటీ చెప్పిందని.. అలాగే జీఎన్ రావు కమిటీ చెప్పిందే బోస్టన్ కమిటీ చెప్పిందని అన్నారు. ఈ బోస్టన్ కమిటీ కంటే ముందే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎన్ని కమిటీలు చెప్పినా చివరకు తేలింది జగన్ చెప్పిన మాటే అని అన్నారాయన.

అయినా జగన్ చెప్పిన మాట చెల్లుబాటు అవుతుందని తాము చెప్పడం లేదని.. జగన్.. సీఎం అయినప్పటికీ రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు లేదని అభిప్రాయపడ్డారు. 2014 లో గుంటూరు - విజయవాడ మధ్యన రాజధానిని ఏర్పాటు చేయాలనీ అన్ని పార్టీలు సూచించాయని.. దాన్ని బట్టే అసెంబ్లీ కూడా ఆమోదించిందని.. ఇప్పుడు ఏ రకంగా రాజధానిని మారుస్తారో ముఖ్యమంత్రి చెప్పాలని కన్నా లక్ష్మీనారాయణ సీఎంను వివరణ కోరారు. బీజేపీ పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణకు సానుకూలంగా ఉందని.. పాలనా వికేంద్రీకరణకు కాదని అన్నారాయన.

ఇదిలావుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూడు రాజధానుల అంశంపై మాట్లాడుతూ.. రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశమని.. ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదిక తీసుకోకుండా బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని సూచించారు. అలాగే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా రాజధాని రాష్ట్ర పరిధిలో ఉన్న అంశమని.. దీనిపై జోక్యం చేసుకోమంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories