బీజేపీ-వైసీపీ దోస్తీపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ

బీజేపీ-వైసీపీ దోస్తీపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ
x
కన్నా లక్ష్మీనారాయణ ఫైల్ ఫోటో
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటనలో బీజీబీజీగా గడపుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటనలో బీజీబీజీగా గడపుతున్నారు. మరోవైపు ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ-వైసీపీ దోస్తీ కుదిరిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా శుక్రవారం మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ఎన్డీఏలో చేరడంపై తమకు సమాచారం లేదన్నారు. ఎన్టీఏ చేరిక విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని అన్నారు. తాము టీడీపీ వైసీపీ విధానాలకు వ్యతిరేకమని, ఇదే అంశంపై ఇప్పటికే తమ పార్టీ ఇంఛార్జ్‌లు ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. సీఎం జగన్ పరిపాలనా పరమైన అంశాలపై ప్రధానితో, కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారని తెలిపారు. ఈ భేటీలకు రాజకీయాలకు సంబంధం లేదని అభిప్రాయపడ్డారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కార్యకర్తలపై దాడులు పెరిగాయని కన్నా విమర్శించారు. కడప జిల్లాలో అక్రమ ఇసుక దందాను అడ్డుకున్న బీజేపీ నేతలపై దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ నేతలు కేసు పెడితే తిరిగి వారిపైనే కేసులు పెట్టారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

అయితే శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స వైసీపీ- ఎన్డీయేలో చేరవచ్చన్న వార్తలను ఆ పార్టీ నేతలు ఖండించారు. తాను అనని మాటలను అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కొన్ని పత్రికలు చంద్రబాబు, ఓ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయని చెప్పారు. ఎందుకు ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు మంత్రి బొత్స అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. సీపీఐ నేత రామకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories