'అందుకే ప్రజలు సీట్ మారుస్తున్నారు'

అందుకే ప్రజలు సీట్ మారుస్తున్నారు
x
Highlights

ప్రధాని గంటకో డ్రెస్ మారుస్తారు ఇదేనా అభివృద్ధి అని ఏపీసీఎం చంద్రబాబునాయుడు.. మోదీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ సైతం ఘాటుగా రిప్లై...

ప్రధాని గంటకో డ్రెస్ మారుస్తారు ఇదేనా అభివృద్ధి అని ఏపీసీఎం చంద్రబాబునాయుడు.. మోదీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ సైతం ఘాటుగా రిప్లై ఇస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయనపై ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు.

'మోదీ గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదుగానీ.. నువ్వు మాత్రం ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తావ్. నిమిషానికి ఒక మాట మారుస్తావ్. నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తావ్. ఎమ్మెల్యేలను కొని వాళ్ళ పార్టీ మారుస్తావ్. అందుకే ప్రజలు ఈ ఎన్నికలలో నీ సీట్ మారుస్తున్నారు.' అంటూ ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories