కుటుంబ సమేతంగా ముక్కంటిని దర్శించుకున్న కాంచీపురం కలెక్టర్

కుటుంబ సమేతంగా ముక్కంటిని దర్శించుకున్న కాంచీపురం కలెక్టర్
x
Highlights

శ్రీకాళహస్తి: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి తమిళనాడు రాష్ట్ర కాంచీపురం జిల్లా...

శ్రీకాళహస్తి: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి తమిళనాడు రాష్ట్ర కాంచీపురం జిల్లా కలెక్టర్ పి.పొన్నయ్య ఐఏఎస్ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ ఏఈవో మోహన్, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు ఏర్పాటు చేశారు.

పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులచే ఆశీర్వాదం తో పాటు స్వామివారి శాలువను కప్పి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిఆర్వో హరి యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శనం, ఆలయ అధికారులు, వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories