రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి

రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
x
కిమిడి కళా వెంకటరావు
Highlights

నగర పంచాయతీ పరిధిలో మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు సమావేశం నిర్వహించారు.

పాలకొండ: నగర పంచాయతీ పరిధిలో మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు నోరు నొక్కే విధంగా పని చేస్తుందని విమర్శించారు. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి 20 సంవత్సరాల వెనక్కి వెళ్లలే పరిస్థితి తీసుకువస్తున్నారు అని ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్ పై ఇన్కమ్ టాక్స్ సరిగ్గా లేదు అని అధికారిపై సస్పెండ్ చేశారు. ప్రజలు సమస్యలు పై ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలు ఉంది అని కానీ దాన్ని విరుద్ధంగా అసెంబ్లీలో కి రానీయకుండా గేట్ లు వేస్తున్నారని ఆరోపించారు.

పనులు, బిల్లు ఎక్కడికి అక్కడ నిలిచిపోయి కూలీలు జీవనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో సాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, ఎక్కడికి అక్కడ నిలిపివేశారు, రోడ్డులు కూడా అద్వానంగా తయారు అయి కనీసం మరమ్మతులు చేపట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉంది అని విమర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రజాసంక్షేమ, రాష్ట్ర అభివృద్ధి చేసేవారు నాయకులు అవుతారు తప్ప ప్యాక్స్నిస్ట్ నాయకులు అయితే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలు పక్కన పెట్టి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాలి అని కోరారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories