Kakinada: కర్నూలులో న్యాయ రాజధానికి వ్యతిరేకంగా ధర్నా

Kakinada: కర్నూలులో న్యాయ రాజధానికి వ్యతిరేకంగా ధర్నా
x
Highlights

హైకోర్టును అమరావతి నుండి కర్నూలుకు మార్చడాన్నీ టీడీపీకి చెందిన కాకినాడ బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో ప్రజలు, పౌర సమాజ...

హైకోర్టును అమరావతి నుండి కర్నూలుకు మార్చడాన్నీ టీడీపీకి చెందిన కాకినాడ బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో ప్రజలు, పౌర సమాజ సంస్థలు మరియు రాజకీయ పార్టీల సహకారాన్ని కోరింది. కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం కాకినాడ కలెక్టరేట్ ముందు ధర్నా ప్రదర్శించారు. వికేంద్రీకరణ పేరిట ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలను రేకెత్తిస్తోందని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంపిఎస్ బాలా సుబ్రమణ్యం ఆరోపించారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇది అశాంతిని సృష్టించే అవకాశం ఉందన్నారు. అమరావతిలో హైకోర్టును ఉంచాలని కోరుతూ తాము కోర్టులో విధులను బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు.

తమకు ప్రజల మద్దతు అవసరం అని సుబ్రమణ్యం అన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నాలుగు జిల్లాల కేసులను పరిష్కరించడానికి కాకినాడలో హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. అమరావతి.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు మరియు నగరాలకు కేంద్ర బిందువు అని, ప్రజలు అమరావతికి వెళ్లడానికి చాలా అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు. కానీ, కర్నూలు వెళ్ళడానికి సరైన రవాణా వ్యవస్థ లేదని పైగా కాకినాడకు మరింత దూరంగా ఉందని అన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు షరీఫ్, సంయుక్త కార్యదర్శి టాటా రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోవైపు కర్నూలుకు హైకోర్టు తరలించడాన్ని తూర్పు గోదావరి జిల్లా న్యాయవాదుల జెఎసి కన్వీనర్ ఎం సుబ్బారావు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలో జ్యుడీషియల్ కమిషన్, ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో రెడ్ బ్యాడ్జ్‌లు ధరించి నేడు కోర్టుకు హాజరుకావాలని సుబ్బారావు పిలుపునిచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జనవరి 23 న పెద్దాపురంలో న్యాయవాదులు జెఎసి సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జెఎసి అధ్యక్షుడు, కార్యదర్శి తదితరులు పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories