Kakani Govardhan Reddy: ఈ సారి కూడా చంద్రబాబుకు శృంగ భంగం తప్పదు

Kakani Govardhan Reddy Comments On Chandrababu And Lokesh
x

Kakani Govardhan Reddy: ఈ సారి కూడా చంద్రబాబుకు శృంగ భంగం తప్పదు 

Highlights

Kakani Govardhan Reddy: ప్రతిపక్షంలో విప్పడం.. అధికారంలో గళం మూసుకుపోవడం తండ్రీకొడుకులకు అలవాటే

Kakani Govardhan Reddy: నారా లోకేష్‌ యువగళం యాత్రపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. లోకేష్‌ చేయాల్సింది పాదయాత్ర కాదు తన తండ్రి చేసిన మోసాలపై పాప పరిహార యాత్ర చేస్తే మంచిదన్నారు. లోకేష్‌ది సమాజంలో ఒక ఫెయిల్యూర్‌ పొలిటీషియన్‌ చేసే పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. వయసు పైబడడంతో చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను చివరి అస్త్రంగా ప్రయోగిస్తున్నాడని తెలిపారు. ఈ సారి కూడా చంద్రబాబుకు శృంగ భంగం తప్పదన్నారు. లోకేష్‌ పాదయాత్రలో ఏం మాట్లాడుతారోనని టీడీపీ నాయకులు టెన్షన్‌ పడుతున్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విప్పడం అధికారంలోకి రాగానే గళం మూసుకుపోవడం చంద్రబాబు, లోకేష్‌కి ఆనవాయితీగా వస్తుందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్‌ గళం మూగబోయిందని ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మళ్లీ గళం విప్పుతానంటున్నాడన్నారు. లోకేష్‌ గళం మళ్లీ మూసుకుపోవడమే తప్ప విరబూసేది కాదని కాకాని విమర్శించారు. గందరగోళాల మధ్య పాదయాత్ర జరిగేలా చంద్రబాబు ప్రేరేపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని జరగబోయే పరిణామాలను గమనిస్తున్నామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories