సీఐ మాధవ్‌ రాజీనామా..! వైసీపీలో చేరతారని ప్రచారం

సీఐ మాధవ్‌ రాజీనామా..! వైసీపీలో చేరతారని ప్రచారం
x
Highlights

టీడీపీ సీనియర్‌ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై మీసం తిప్పి మరీ సవాల్‌ విసిరిన అనంతపురం జిల్లా కదిరి అర్బన్‌ సీఐ గోరంట్ల మాధవ్‌ తన...

టీడీపీ సీనియర్‌ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై మీసం తిప్పి మరీ సవాల్‌ విసిరిన అనంతపురం జిల్లా కదిరి అర్బన్‌ సీఐ గోరంట్ల మాధవ్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తారని వదంతులు వస్తున్నాయి. ఆయన తన రాజినామా లేఖను కదిరి డీఎస్పీ లక్ష్మికి అందించనున్నట్టు తెలుస్తోంది. 22 ఏళ్లుగా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన మాధవ్‌ తన నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఉందన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పోలీసు అధికారుల సంఘం నాయకుడిగా.. జేసీ దివాకర్‌ రెడ్డికి సవాలు విసిరి వార్తల్లోకి వచ్చారు. కాగా ఆయన హిందూపురం పార్లమెంటు స్థానం పోటీ చెయ్యాలని భావిస్తున్నట్టు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఎంపీగా అవకాశం ఇస్తామన్న మేరకే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories