Top
logo

వైసీపీలో చేరిన సీఐ గోరంట్ల మాధవ్

వైసీపీలో చేరిన సీఐ గోరంట్ల మాధవ్
Highlights

ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన కదిరి సిఐ గోరంట్ల మాధవ్ జగన్ సమక్షంలో శనివారం వైసీపీలో చేరారు. అంతకుముందు...

ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన కదిరి సిఐ గోరంట్ల మాధవ్ జగన్ సమక్షంలో శనివారం వైసీపీలో చేరారు. అంతకుముందు జగన్ తో భేటీ అయిన మాధవ్ పోటీ గురించి చర్చించినట్టు తెలుస్తోంది. కాగా రెండేళ్ల నుంచి రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు రావాలా అని ఎదురుచూస్తున్న మాధవ్ ఎట్టకేలకు ఆ ముచ్చట తీర్చేసుకున్నారు. గతంలో మాధవ్ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది మొదలు ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. కమిట్‌మెంట్, నిజాయితీలే ఆయనకు ప్రజల్లో ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారనే పేరు మాధవ్ పై ఉంది. మరోవైపు హిందూపురం పార్లమెంట్ స్థానం ఆయనకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story


లైవ్ టీవి