వైఎస్ వివేకా కేసు.. పరమేశ్వర్‌ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీని కలిసినట్టు అనుమానం

వైఎస్ వివేకా కేసు.. పరమేశ్వర్‌ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీని కలిసినట్టు అనుమానం
x
వైఎస్‌ వివేకానందరెడ్డి
Highlights

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతం వేశారు సిట్‌ అధికారులు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతం వేశారు సిట్‌ అధికారులు. పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ నేతృత్వంలో.. ఐదుగురు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో కడప హరిత హోటల్‌లో విచారణ జరిగింది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి కడపలో ఉన్న... టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి(మారెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి)ని.. ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న పరమేశ్వర్‌ రెడ్డి కలిసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాంతో పరమేశ్వర్‌ రెడ్డి చికిత్స పొందిన సన్ సైన్ హాస్పిటల్ వైద్యులను, నగరంలోని హరిత హోటల్‌ యజమాన్యాయాన్ని సిట్ అధికారులు విచారించారు. హరిత హోటల్‌ లో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని పరమేశ్వర్‌ రెడ్డి కలిసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఈ కేసులో.. మొదటి నుంచి పరమేశ్వర్‌ రెడ్డిని కీలక నిందితుడిగా అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో ఇదే అంశంపై హరిత హోటల్‌లో విచారించారు సిట్‌ అధికారులు. వీరిద్దరూ ఏ విషయం గురించి మాట్లాడుకున్నారనే విషయాలపై విచారణ జరిపారు. హోటల్‌ రికార్డులలో ఉన్న విజిటర్స్ పేర్లను పరిశీలించారు. హత్య జరిగిన మార్చ్ 14న హరిత హోటల్‌ రూమ్‌ నెం.104లో బీటెక్‌ రవి బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. హరిత హోటల్‌ సీసీ ఫుటేజ్‌ ఇవ్వాలని మేనేజర్‌ను కోరారు సిట్‌ అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories