డీసీసీబీ చైర్మన్‌గా తిరుపాల్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

డీసీసీబీ చైర్మన్‌గా తిరుపాల్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
x
Highlights

కడప జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ) ఛైర్మన్‌గా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వై తిరుపాల్ రెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు....

కడప జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ) ఛైర్మన్‌గా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వై తిరుపాల్ రెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. 2019 ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ విజయానికి తిరుపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక డీసీసీబీ చైర్మన్ పదవికి ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పోచమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప మాజీ మేయర్ ఎం. సురేష్ బాబు నూతన చైర్మన్ ను అభినందించారు. ఈ సందర్భంగా తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ.. డీసీసీబీ చైర్మన్ కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పేద, సన్నకారు రైతులకు ఇబ్బంది లేకుండా రుణాలు ఇచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు. మైదుకూరు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories