పంచెకట్టుతో మెరిసి పోతున్న కడప పోలీసులు

పంచెకట్టుతో మెరిసి పోతున్న కడప పోలీసులు
x
పంచెకట్టుతో మెరిసి పోతున్న కడప పోలీసులు
Highlights

ఖాకీ దుస్తులతొ కరుకుగా కనిపించే పొలీసు అదికారులు పంచెకట్టుతో మెరిసి పోతున్నారు. ఎల్లప్పుడూ విధి నిర్వహణలో శరీరానికి అతుక్కు పోయే యూనిఫామ్‌తో కరకుగా...

ఖాకీ దుస్తులతొ కరుకుగా కనిపించే పొలీసు అదికారులు పంచెకట్టుతో మెరిసి పోతున్నారు. ఎల్లప్పుడూ విధి నిర్వహణలో శరీరానికి అతుక్కు పోయే యూనిఫామ్‌తో కరకుగా కనిపించే కడప పోలీసులు ఒక్కసారిగా తళతళలాడే తెల్లని పంచెకట్టుతో ప్రత్యక్షమయ్యారు. విధి నిర్వహణలో ప్రతిరోజు ఒత్తిడితో గడిపే పోలీసులు ఈ ఏడాది సంక్రాంతి సంతోషంగా గడపాలన్న సంకల్పంతో సాంప్రదాయ దుస్తులు కట్టుకున్నారు.

కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపేందుకు పంచెకట్టుతో వెళ్లడంతొ అందరు అశ్చర్యానికి లోనయ్యారు. డిఎస్పీ ,సీఐలు, ఎసైలు కడప ఎస్పీని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీన్ చూసిన SP అన్బురాజన్ కూడా వెంటనే తెల్లని దుస్తులు ధరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడూ కేసులు ఫైళ్ళు విచారణలతో సీరియస్‌గ కనిపించే పోలీస్ కార్యాలయాలలో పండుగ వాతావరణం కనిపించింది. అందరు పంచెకట్టుతో గ్రూప్ ఫోటోలు తీసుకునే సీన్ చూసిన పొలీసులను, ఎస్పీ బంగ్లా సిబ్బంది, జనం అందరూ వారిని ఆసక్తిగా చూడసాగారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories