మామిడితోట అమ్మకం విషయంలో ఘర్షణ.. భార్యను హత్యచేసిన భర్త

మామిడితోట అమ్మకం విషయంలో ఘర్షణ.. భార్యను హత్యచేసిన భర్త
x
Highlights

మామిడి తోటలను విక్రయించే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీసింది. దాంతో 45 ఏళ్ల భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కడప జిల్లాలో...

మామిడి తోటలను విక్రయించే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీసింది. దాంతో 45 ఏళ్ల భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. రాయచోటి పట్టణానికి చెందిన ఎస్‌కె ఖాదర్ వలి, నూర్‌జహాన్ దంపతులు. వీరికి మొహమ్మద్ రఫీ సంతానం ఉన్నారు. ఈ కుటుంబం కొంతకాలంగా అప్పుల్లో కూరుకుపోయింది. దాంతో లక్కీరెడ్డి పల్లి మండలంలోని మద్దిరేవులరెడ్డి పల్లి గ్రామంలో ఉన్న మామిడి తోటలను అమ్మి అప్పు తీర్చాలని ఖాదర్ వలి నిర్ణయించుకున్నారు. దీంతో ఈ విషయం భార్యతో చర్చించాడు.

ఆమె వ్యతిరేకించింది. ఈ విషయం భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. శుక్రవారం అర్ధరాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది, కోపోద్రిక్తుడైన ఖాదర్ వలి భార్యపై కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నూర్‌జహాన్ మృతిచెందింది.. అడ్డొచ్చిన కుమారుడు మొహమ్మద్ రఫీ కి గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories