బోటు వెలికితీత మళ్లీ విఫలం.. కారణం ఇదే..

బోటు వెలికితీత మళ్లీ విఫలం.. కారణం ఇదే..
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిన 'రాయల్‌ వశిష్ట' బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి...

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిన 'రాయల్‌ వశిష్ట' బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బోటు తీసేందుకు ప్రయత్నించి విఫలమైంది. తాజగా ఆ బోటు కేవలం 50 అడుగుల లోతులోనే ఉందన్న విషయాన్ని గుర్తించిన సత్యం బృందం శనివారం దాన్ని వెలికితీసేందుకు ప్రయత్నించి మరోసారి విఫలమైంది. యాంకర్‌కు చిక్కిన బోటు దాన్ని పైకి లేపే క్రమంలో పట్టు కోల్పోయింది. దీంతో కథ మల్లి మొదటికొచ్చింది.

మరోసారి యాంకర్లను బోటుకు తగిలించడంకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. శనివారం లేదంటే ఆదివారం ఉదయానికల్లా బోటును వెలికి తీస్తామని సత్యం బృందం చెబుతున్నారు. క్రమంగా నీటి ప్రవాహం తగ్గుతోందన్న సత్యం.. గతంకంటే ఇప్పుడు పని సులభంగా అవుతుందని అంటున్నారు. బోటు దగ్గరికి వెళ్లేందుకు గజ ఈతగాళ్లు సిద్ధమైనా ఏదైనా జరగరానిది జరుగుతుందేమోనని అధికారులు సందేహిస్తున్నారు. విశాఖపట్నం నుంచి కొందరు గజ ఈతగాళ్లను కూడా ధర్మాడి సత్యం రప్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories