నేడు బోటు బయటికి వచ్చే అవకాశం.. అలా జరిగితే మాత్రం..

నేడు బోటు బయటికి వచ్చే అవకాశం.. అలా జరిగితే మాత్రం..
x
Highlights

దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే పనులు సోమవారం మరోసారి ప్రారంభమయ్యాయి. ధర్మాడీ సత్యం బృందం...

దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే పనులు సోమవారం మరోసారి ప్రారంభమయ్యాయి. ధర్మాడీ సత్యం బృందం ఈరోజు బోటు వెలికితీత పనులను ఓ కొలిక్కి తీసుకువచ్చే వుంది. విశాఖ నుంచి వచ్చిన మెరైన్‌ డైవర్లు ఆదివారం నదీ గర్భంలో చిక్కుకున్న బోటు వద్దకు రెండుసార్లు వెళ్లి వచ్చారు.. నదీలో వెళ్లిన మెరైన్‌ డైవర్లు నీటి అడుగున బోటు ఏ పరిస్థితిలో ఉంది, ఎంత లోతులో ఉంది.. తీయడానికి సాధ్యమేనా అన్న విషయాలను కనుగొని అధికారులకు, ధర్మాడి సత్యం బృందానికి వివరించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని మృతదేహాన్ని వెలికితీశారు. నల్ల జీన్‌ ప్యాంట్, తెల్ల టీషర్ట్‌తో ఉన్న ఆ మృతదేహం ఎవరిదనేది గుర్తించాల్సి ఉంది.

మరోవైపు బోటు ముందు భాగం 35 అడుగుల లోతున నదీ ప్రవాహానికి అడ్డంగా, వెనుక భాగం 70 అడుగుల లోతులో ఉందని మెరైన్‌ డైవర్స్‌ అధికారులకు తెలిపారు. అంతేకాదు బోటు ముందు భాగం 10 శాతం మేర బురదలో కూరుకుపోయినట్లు గుర్తించారు. బోటు మునిగిన ప్రాంతం నుంచి దాదాపు వంద మీటర్లు కిందకి కొట్టుకెళ్లిందని తెలిపారు. దీన్ని బట్టి సత్యం బృందం పనులను నేడు పునఃప్రారంభించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఇవాళ సాయంత్రానికే బోటును వెలికితీసే పని పూర్తవుతుందని ధర్మాడి సత్యం బృందం, మెరైన్‌ డైవర్లు చెబుతున్నారు. అయితే వర్షం వస్తే మాత్రం చెప్పలేమని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories