వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్

వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
x
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ లాగ లక్షల కోట్ల అవినీతితో పత్రిక, ఛానల్ పెట్టుకుని...

వైసీపీ అధినేత వైయస్ జగన్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ లాగ లక్షల కోట్ల అవినీతితో పత్రిక, ఛానల్ పెట్టుకుని నేను డబ్బా కొట్టుకోవడం లేదని అన్నారు. నిన్న కాక మొన్న ఇండియా టుడే కాంక్లేవ్ జగన్ అరెస్ట్ గురించి ప్రస్తావించారు.. అరెస్ట్ చేస్తారనే కదా బీజేపీ వారికి సపోర్ట్ ఇచ్చారు అని ఆ ఛానల్ ప్రతినిధి అడిగారు.. అసలు జగన్ ను జైలు నుంచి ఎవరైనా తప్పించగలరా అని ప్రశ్నించారు. నన్ను 2012 మే 21న జగన్ అరెస్ట్ చేయించాడు.. దాంతో నేను అహ్మద్ పటేల్ కు ఫోన్ చేసి మే 25న

జగన్ ను అరెస్ట్ చేయించా.. అది ఇవాళ చెబుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాశాంతి పార్టీకి 100లో 50 ఓట్లు పడతాయనే భయంతో వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు కేఏ పాల్.. కాగా ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories