ఏడు పార్టీలు మారావ్.. నాకు ఫోన్ చేస్తే నేనే సపోర్ట్ చేస్తా.. పవన్ పై కేఏ పాల్ సంచలన వ్యా‌ఖ్యలు

ఏడు పార్టీలు మారావ్.. నాకు ఫోన్ చేస్తే నేనే సపోర్ట్ చేస్తా.. పవన్ పై కేఏ పాల్ సంచలన వ్యా‌ఖ్యలు
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో కేఏ పాల్, పవన్ కళ్యాణ్ పై పలు విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా గెలవకుండానే ఏడు పార్టీలు మారిన ఘణత పవన్ కే దక్కిందని ఎద్దేవా చేశారు. ఓరిజినల్ పార్టీ ప్రజారాజ్యం.. తరువాత కాంగ్రెస్‌లో చేరారు. తరువాత సీపీఐ సీపీఎం.. ఆ తరువాత బీఎస్పీ మాయావతి కాళ్లపై పడ్డావ్ తమ్ముడూ.. మరలా బీజేపీ అన్నావ్.. మళ్లీ ఇప్పుడు బీజేపీ అంటున్నావ్ అని విమర్శించారు. పవన్ ఫ్యాన్స్ అతని ఒకసారి చెప్పాలని సూచించారు.

ఇటీవలే తెలంగాణలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఆ తరువాత బీజేపీకి మద్దతు ఇస్తా అని నిలకడ లేని మనస్థత్వాం ఎంటని ప్రశ్నించాడు. ఈ సంద్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... నీకు 5 శాతం ఓటు బ్యాంక్ ఉంది కదా.. బీజేపీకి ఒక్కశాతం కూడా ఓటింగ్ లేదు. నువ్వు బీజేపీ ఏజెంట్ కాకపోతే తిరుపతిలో ఖచ్చితంగా పోటీ చేసేవాడివి. పవన్‌ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో గమనించండి. అని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లో ఎందుకు లాగుతావ్.. నిజంగా నీకు సేవ చేయాలి అని ఉంటే నువ్వు తిరుపతి బై పోల్‌లో నిలబడు.. లేదంటే మీ అన్నని నిలబెట్టు.. నీ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తినైనా నిలబెట్టు అని హితవు పలికారు. అప్పుడు నువ్ బీజేపీ ఏజెంట్ కాదని రుజువు చేసుకో పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు కేఏ పాల్.

తిరుపతి ఉపఎన్నికలలో పోటీ చేస్తే చాలా మంది మద్దతు ఉంటుందని, తనకు ఫోన్ చేస్తే సపోర్ట్ చేస్తా అని పాల్ అన్నారు. ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేస్తాన్నరు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన పార్టీలక ఓటు వేయొద్దన్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై కూడా పాల్ నిప్పులు చెరిగారు. టీడీపీ, వైసీపీ రెండు ఒక్కటేనని, రెండు పార్టీలు అరాచక శక్తులని, ఆ పార్టీని ఎన్నికల్లో చిత్తుగా ఓడిచాలని ఓటర్లకు కేఏ పాల్ పిలుపునిచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories