జ్యోతి కుటుంబ సభ్యుల ఆందోళన.. విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌ను కలవనున్న జ్యోతి కుటుంబీకులు

జ్యోతి కుటుంబ సభ్యుల ఆందోళన.. విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌ను కలవనున్న జ్యోతి కుటుంబీకులు
x
జ్యోతి కుటుంబ సభ్యుల ఆందోళన
Highlights

చైనాలోని వూహాన్‌లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన యువతి జ్యోతి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి...

చైనాలోని వూహాన్‌లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన యువతి జ్యోతి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ద్వారా కేంద్రమంత్రులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనెల 14న జ్యోతి వివాహం ఉండటంతో వీలైనంత త్వరగా తమ కుమార్తెను స్వస్థలానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ప్రాణాంతక కరోనా దెబ్బతో విలవిల్లాడుతున్న వూహాన్‌లో తమ కుమార్తె చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోందని జ్యోతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటివారిని భారత్‌కు తీసుకొచ్చి తమ కుమార్తెను మాత్రమే వదిలేసి వచ్చారంటూ అసహనం వ్యక్తం చేశారు. కనీసం చైనాలోనైనా మరో సురక్షిత ప్రాంతానికి తనను తరలించాలంటూ జ్యోతి విజ్ఞప్తి చేస్తోంది.

ఈ నేపథ్యంలో జ్యోతిని రప్పించేందుకు వైసీపీ ఎంపీ బ్రహ్మానందరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ‌్నం జ్యోతి కుటుంబ సభ్యులు విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌ను కలవనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories