ఇంగ్లీష్ మీడియం విద్య తప్పనిసరి: జస్టిస్ ఈశ్వరయ్య

ఇంగ్లీష్ మీడియం విద్య తప్పనిసరి: జస్టిస్ ఈశ్వరయ్య
x
జస్టిస్ ఈశ్వరయ్య
Highlights

ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని తెలుగు విద్యార్థులు ఎదుర్కోవాలంటే ఇంగ్లీష్ మీడియం విద్య తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య అన్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని తెలుగు విద్యార్థులు ఎదుర్కోవాలంటే ఇంగ్లీష్ మీడియం విద్య తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య అన్నారు. తాడేపల్లిలోని ఏపీ ఉన్నత విద్యా పర్యవేక్షణ కమిషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడారు. ఆంగ్ల మాధ్యమం ప్రారంభ దశలో విద్యార్థులకు తలెత్తే సమస్యలను ఉపాధ్యాయులు పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు ఈశ్వరయ్య చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను అమలు చేయాలని సూచించారాయన.

తెలుగుతో పోలిస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం అని, పిల్లలు హాయిగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చని, ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యను అభ్యసించవచ్చని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల డిమాండ్ కారణంగా ఇంగ్లీష్ మీడియం విద్యపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య కోసం అధిక డబ్బు చెల్లిస్తున్నారని గమనించి.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మాధ్యమంలో చదివిన వారు నిపుణులు అయ్యారని.. వారిలో కొందరు విదేశాలకు వెళ్లి భారీగా సంపాదిస్తున్నారు.. కానీ తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కానిస్టేబుళ్లు, జవాన్లు , ఆటో డ్రైవర్లు మరియు కార్ డ్రైవర్లుగా మారారని అన్నారు.

తాను కూడా తెలుగు మీడియాలోనే చదివానని దానివలన సుప్రీం కోర్టు జడ్జి కావాల్సిన తాను కాలేకపోయానని అన్నారు. ఇంగ్లీష్ మాధ్యమంను రాజకీయం చేయకుండా ఆహ్వానించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మాధ్యమంగా మార్చడం పట్ల తల్లిదండ్రులు, పిల్లలు సంతోషంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లలు చిన్నప్పటి నుంచీ ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుంటే వారు సులభంగా విద్యను అబ్బుతుందని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాఠశాల విద్యలో ప్రఖ్యాత విద్యావేత్తలతో మేధో కమిటీని ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్లంలోకి మార్చడానికి అలాగే రాబోయే రోజుల్లో విజయవంతంగా నడిపించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories