జూడాల ఆందోళనతో అలిపిరిలో టెన్షన్‌..

జూడాల ఆందోళనతో అలిపిరిలో టెన్షన్‌..
x
Highlights

అఖిల భారత వైద్య మండలి.. MCI స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్.. NMC ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటు ఓ బిల్లును ఇటీవల ఆమోదించింది. దీంతో ఈ బిల్లును...

అఖిల భారత వైద్య మండలి.. MCI స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్.. NMC ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటు ఓ బిల్లును ఇటీవల ఆమోదించింది. దీంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలుచోట్ల వైద్యులు ఆందోళనకు దిగారు. NMC బిల్లుకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో జూనియర్‌ డాక్టర్లు గత ఆరు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. తిరుమలలో జూడాల ఆందోళనతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

తిరుపతిలో జూడాలు చేపట్టిన ధర్నా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అలిపిరి వద్ద తిరుమల కొండపైకి వెళ్లే మార్గంలో జూనియర్‌ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. భక్తులు కొండపై వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ధర్నా చేపట్టడంతో భక్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు ఆగ్రహించి జూడాలతో ఘర్షణకు దిగారు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

తిరుమల కొండకు వెళ్లే మార్గమధ్యంలో జూడాలు ఆందోళన చేపట్టడంపై కొందరు మండిపడుతున్నారు. భక్తులకు ఆటంకం కలిగిస్తూ, వాహనాలు నిలిచిపోయేలా ధర్నా ఎలా చేపడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జూడాల విధానం సరిగా లేదని, ఇతరులకు ఆటంకం కలిగించకుండా ధర్నాలు చేపట్టాలని భక్తులు చెప్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories