లోపల పేషెంట్లు బెడ్ పై సెలైన్ బాటిల్స్ తో.. బయట డాక్టర్లు తొక్కుడు బిళ్ల ఆట..

లోపల పేషెంట్లు బెడ్ పై సెలైన్ బాటిల్స్ తో.. బయట డాక్టర్లు తొక్కుడు బిళ్ల ఆట..
x
Highlights

డాక్టర్లంటే పేషెంట్లకు దైవంతో సమానం. బతకరు అనే రోగిని సైతం తమ హస్తవాసితో బతికించే డాక్టర్లను ఎంతో మందిని చూసే ఉంటాం. అది ఆ వృత్తికి ఉన్న గౌరవం. కానీ...

డాక్టర్లంటే పేషెంట్లకు దైవంతో సమానం. బతకరు అనే రోగిని సైతం తమ హస్తవాసితో బతికించే డాక్టర్లను ఎంతో మందిని చూసే ఉంటాం. అది ఆ వృత్తికి ఉన్న గౌరవం. కానీ నెల్లూరు జిల్లా పీహెచ్‌సీలో జూనియర్ డాక్టర్లకు అదేం పట్టినట్లు లేదు.

ప్రభుత్వాసుపత్రుల్లో అద్భుతమైన సేవలందిస్తున్నామని సర్కార్లు చెబుతుంటాయి. కానీ, ఆచరణలో అలాంటి దాఖలాలే కనిపించవు. తాజాగా నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చూడండి. అక్కడ పేషెంట్ల దారి పేషెంట్లదే డాక్టర్ల దారి డాక్టర్లదే ఈ పీహెచ్ సీలో ఉన్న ఇద్దరు డాక్టర్లు ఒకే సారి సెలవుపై వెళ్లారు. అయితే, బాధ్యతలను జూనియర్ డాక్టర్లకు అప్పగించారు. ఇదే అదనుగా ఆ జూనియర్ డాక్టర్లు, చిన్న పిల్లలయిపోయారు. ఆరోగ్య కేంద్రంలో విధులను గాలికొదిలేసి ఆవరణలోఆటలాడుతూ కనిపించారు.

లోపల పేషెంట్లు బెడ్ పై సెలైన్ బాటిల్స్ తో నీరసంగా కనిపిస్తుంటే ఈ జూనియర్ డాక్టర్లు బయట తొక్కుడు బిళ్ల ఆటలాడుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. పేషెంట్లకు స్వస్థత చేకూర్చాల్సింది పోయి ఆటలాడుకుంటుండటంపై ప్రజలనుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆసుపత్రా? లేక ఆటస్థలమా? అని ప్రశ్నిస్తున్నారు. సెలవుపై వెళ్లిన డాక్టర్లను వెనక్కి రప్పించి పేషెంట్లకు వైద్యం అందించాలని, ఈ జూనియర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories