Jogi Ramesh: డీఎస్పీపై మంత్రి జోగి రమేష్ సీరియస్

Jogi Ramesh Fire On DSP
x

Jogi Ramesh: డీఎస్పీపై మంత్రి జోగి రమేష్ సీరియస్

Highlights

Jogi Ramesh: మచిలీపట్నం డీఎస్పీ బాషాపై మంత్రి జోగి రమేష్ రుసరుస

Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ పోలీస్ ఆఫీసర్‌పై సీరియస్ అయ్యారు. పదుల సంఖ్యలో అధికారులు, లీడర్ల మధ్యలో డీఎస్పీని విసుక్కున్నారు. పక్కకు వెళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. మచిలీపట్నంలో మంత్రి రోజా పర్యటించారు. మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే పేర్ని నాని, ఇతర నాయకులు రోజాకు స్వాగతం పలికారు. ఈ సమయంలో పలువురు నాయకులు రోజాకు పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు వచ్చారు. ఒక్కో లీడర్‌ను మంత్రి రోజాకు పేర్ని నాని పరిచయం చేశారు.

ఈ క్రమంలో రోజాకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు వచ్చారు. అయితే ఎస్పీకి అడ్డుగా నిలబడిన వారిని పక్కకు జరగాలని డీఎస్పీ కోరారు. డీఎస్పీ చేయి తనకు తగలడంతో పక్కకు వెళ్లు ముందు అంటూ ఆయనపై మంత్రి ‌జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్షూ బాషా వైపు కోపంగా చూశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories