ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు

ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు
x
చింతపల్లి ప్రభుత్వ ఐటీఐ
Highlights

నేడు చింతపల్లి ప్రభుత్వ ఐటీఐ నందు నెల్లూరు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్( ప్రైవేట్) లిమిటెడ్ కంపెనీ నుండి శాశ్వత ఉద్యోగుల కొరకు ఐటీఐ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

చింతపల్లి: నేడు చింతపల్లి ప్రభుత్వ ఐటీఐ నందు నెల్లూరు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్( ప్రైవేట్) లిమిటెడ్ కంపెనీ నుండి శాశ్వత ఉద్యోగుల కొరకు ఐటీఐ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును అని స్థానిక ఆర్ ఐటీఐ ప్రిన్సిపల్ రాజారావు తెలిపారు. కే ట్రెండ్ నందు ఉత్తీర్ణులైన వారు సీఎన్సీ మిషన్ ట్రైనింగ్ ఆపరేటర్ ఉద్యోగానికి అర్హులన్నారు.

18 నుంచి 28 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్లకి అవకాశం ఉందన్నారు. నెలకు 10000 తో పాటు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించబడుతుంది అని, ఆసక్తి కలిగిన ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ రోజు బయోడేటాతోపాటు ధ్రువపత్రాలు నకలు, ఆధార్ కార్డు, రెండు పాస్ ఫోటోలతో చింతపల్లి ఆర్ ఐటీఐ నందు హాజరు కావాలని ఆయన అన్నారు. వివరాల కొరకు 9490778807 నెంబర్ కు సంప్రదించాలని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories