6న నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళా

6న నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళా
x
ఫైల్ ఫోటో
Highlights

నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళా ఈనెల 6న ఉదయం పది గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

విశాఖపట్నం: నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళా ఈనెల 6న ఉదయం పది గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారిణి కె.సుధ తెలిపారు. వేబ్రోస్‌ సొల్యూషన్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థలో ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.

జూనియర్‌ మెకానిక్‌ ఆపరేటర్‌, హెల్పర్‌, ప్యాకర్‌ ఖాళీలకు పదో తరగతి, ఇంటర్‌, ఐటిఐ, డిప్లొమో, డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు జీతం ఇస్తారన్నారు. ఆసక్తి గల 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పురుష అభ్యర్థులు అన్ని పత్రాలతో హాజరుకావచ్చని ఆమె తెలిపారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories