తాడిపత్రి ఘటనపై దర్యాప్తు ముమ్మరం

తాడిపత్రి ఘటనపై దర్యాప్తు ముమ్మరం
x
Highlights

* జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు * ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు * నిన్న పరస్పరం దాడులు చేసుకున్న జేసీ, పెద్దారెడ్డి అనుచరులు * రాళ్లు, రాడ్లతో విచక్షణారహితంగా దాడులు

అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు అతడి అనుచరులపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే.. ఘర్షణకు కారణమైన సోమశేఖర్‌రెడ్డితో పాటు.. యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు వలిపై ఐపీసీ 153-a సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

అనంతలో వైసీపీ, టీడీపీల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. తన సతీమణిపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహంతో ఊగిపోయారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. అంతటితో ఆగకుండా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికెళ్లి.. తన అనుచరులతో అనుమానితులపై దాడికి దిగారు. కత్తులు, రాడ్లతో రెచ్చిపోయారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అయితే.. దాడి సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో లేరు.

కొద్దిసేపటికి విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇంటికి చేరుకుని పరిస్థితులను గమనించారు. అప్పటికే తన ఇంటికి వందలాది మంది మద్దతుదారులు చేరుకుని ఆవేశంతో ఊగిపోయారు. పెద్దారెడ్డి అనుచరులపై రాళ్ల దాడికి దిగారు. పెద్దారెడ్డి కారును ధ్వంసం చేశారు. పోలీసుల వాహనంపై కూడా దాడికి యత్నించారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు.. పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఫలితంగా తాడిపత్రి కాస్తా రణరంగంగా మారిపోయింది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories