మరోసారి బాంబ్ పేల్చిన జేసీ.. ఇలా అనేశారేంటి..

మరోసారి బాంబ్ పేల్చిన జేసీ.. ఇలా అనేశారేంటి..
x
Highlights

ఎప్పుడు ఏదో ఒక బాంబు పేల్చే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. ఈసారి గట్టిగానే మరో బాంబ్ పేల్చారు.. ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలలో 30,40 శాతం...

ఎప్పుడు ఏదో ఒక బాంబు పేల్చే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. ఈసారి గట్టిగానే మరో బాంబ్ పేల్చారు.. ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలలో 30,40 శాతం మందిని మార్చకపోతే టీడీపీ అధికారంలోకి రావడం కష్టమేనన్నారు. తమ పార్టీలోని ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదన్న ఆయన.. చంద్రబాబుకు పేరు తెచ్చేవిధంగా ఎమ్మెల్యేల ప్రవర్తించడం లేదన్నారు. సరిహద్దుల్లో ఇప్పుడున్న వాతావరణమే ఉంటే కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 శాతం ఎమ్మెల్యేల్ని మార్చితే మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని.. ఇది పక్కా అని తేల్చేశారు. దీంతో జేసీ మాటలతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. ఓ వైపు టీడీపీ అధికారంలోకి వస్తుందని చెబుతూనే.. ఇలా అనేశారేంటి అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories