జేసీ యూ టర్న్.. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన జేసీ !

జేసీ యూ టర్న్.. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన జేసీ !
x
Highlights

పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తాను ఏ ఒక్కరిని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు...

పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తాను ఏ ఒక్కరిని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. కింది స్ధాయి సిబ్బంది కొందరు అతి చేస్తున్నారని ఇదే విషయాన్ని తాను తెలియజేశానన్నారు. తన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల నుంచి ఆగ్రహం వచ్చిందంటూనే తప్పు చేయనప్పుడు ఎందుకు భయమంటూ ప్రశ్నించారు. ఇప్పుడు తమకు అన్యాయం చేస్తే అధికారంలోకి వచ్చాక కేసులు పెట్టలేమా ? అని మాత్రమే ప్రశ్నించానన్నారు. సీఎం జగన్ వ్యూహాత్మకంగా త్రివిధ రాజధానుల ప్రకటన చేశారంటూ అభిప్రాయపడ్డారు. జగన్ ప్రకటన పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంగా మారందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందన్న జేసీ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories