జగన్ మావాడే.. చంద్రబాబును కొట్టి పంపించలేదు.. జేసీ సంచలన వ్యా‌ఖ్యలు

జగన్ మావాడే.. చంద్రబాబును కొట్టి పంపించలేదు.. జేసీ సంచలన వ్యా‌ఖ్యలు
x
Jc Diwakar Reddy File Photo
Highlights

ఎన్నికల్లో పోటీచేయమని చెప్పడం అది పార్టీ నిర్ణయామా లేక తన అనుచర వర్గానికి సంబంధించిన నిర్ణయమా అని అంతా అనుకుంటున్నారు.

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సీఎం జగన్ పరిపాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి వరకు జగన్‌పై ఒంటి కాలుపై లేచిన జేసీ ఉన్నట్టుండి రూట్ మార్చినట్లు కనిపిస్తున్నారు. జగన్ మాడే అంటూ... జగన్ తొమ్మిది నెలల పాలన భేష్ అంటూ కితాబిచ్చారు.

అయితే చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటనపై కూడా జేసీ కామెంట్స్ చేశారు. చంద్రబాబును విశాఖ పర్యటనను నిరసనకారులు, వైసీపీ శ్రేణులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ పై కోడిగుడ్లు, టమాటాలు దాడి చేశారు. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడిన జేసీ విశాఖలో చంద్రబాబును కొట్టకపోవడం అదృష్టమని వ్యాఖ్యానించారు. పోలీసులే చంద్రబాబును కొట్టకపోవడం సంతోషకమరని జేసీ అన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. చరిత్రలో లేని విధంగా స్థానిక ఎన్నికల్లో 99 శాతం మంది ఏకగ్రీవంగా మారతాయని చెప్పారు. కొత్త చట్టం తీసుకురాడటం ఏకగ్రీవం కోసమే అని అన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఏకగ్రీవం కాయడం ఇదే తొలిసారి కావొచ్చని చెప్పుకొచ్చారు.

ఎలక్షన్లలో డబ్బు, మద్యం పంచినట్లు తేలితే జైల్లో పెడతారని అలాంటప్పుడు భవిష్యత్తులో ఇబ్బందులు పడేబదులు పోటీ చేయకపోవడమే మంచిదన్నారు. అయితే జేసీ దివాకర్‌రెడ్డి చేసిన రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నికల్లో పోటీచేయమని చెప్పడం అది పార్టీ నిర్ణయామా లేక తన అనుచర వర్గానికి సంబంధించిన నిర్ణయమా అని అంతా అనుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories