స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబుకు చెప్పా..బెయిల్ రాకుండా కేసులు.. జేసీ సంచలన వ్యాఖ్యలు


టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ దూరంగా ఉండాలని చంద్రబాబుకు తాను చెప్పానని వెల్లడించారు
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ దూరంగా ఉండాలని చంద్రబాబుకు తాను చెప్పానని వెల్లడించారు. అయితే, ప్రజలు మారారని, ఎన్నికల్లో పోటీ చేద్దామని తనను చంద్రబాబు నచ్చచెప్పే ప్రయత్నం చేశారని అన్నారు. జగన్ కొత్త చట్టాలు తెచ్చినందుకు జనం జేజేలు కొడుతున్నారని, ఆ చట్టం అందరికీ వర్తిస్తేనే మంచిదన్నారు. జేసీ దివాకర్ రెడ్డి సోమవారం టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
జగన్ దూకుడుకు తాను భయపడ్డాను అందుకే స్థానిక ఎన్నికల్లో తమ వర్గం వాళ్లు పోటీకి దిగడంలేదని జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీ కసినా వైసీపీని ఓడించలేవని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రూపాయి డబ్బు పంచకపోయినా వైసీపీ గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో గెలుపు, ఓటమికి భయం లేదని, కొత్త చట్టాన్ని చూసి భయపడుతున్నట్లు స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం ప్రత్యర్థి పార్టీల వారు గెలిచినా.. తర్వాత డబ్బు, మద్యం పంచారని అరెస్టు చేసే అవకాశం ఉందని జేసీ అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తాడిపత్రిలో జరగిన ప్రబోధానంద స్వామి ఆశ్రమంపై దాడి కేసును తిరగదోడుతోందని జేసీ వెల్లడించారు. బెయిల్‌పై విడుదల అయ్యే అవకావం లేకుండా తమ వారిని జైల్లో పెడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో తాను దొరికితే అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ఏ ప్రభుత్వం ఉన్న అధికారులపై ఒత్తిడి ఉండేదని, కానీ ప్రస్తుత జగన్ సర్కార్‌లో మాత్రం అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు.
ఎన్నికలు అయిపోయిన తర్వాత మద్యం, డబ్బు పంచినట్లు తేలితే 3ఏళ్లు జైళ్లో ఉంటారని, దీని వల్ల ప్రతిపక్ష నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటారని జేసీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబును కోరినట్లు తెలిపారు. కానీ, చంద్రబాబు ప్రజల్లో మార్పు వచ్చిందని ,వారిపై అంచెంచల విశ్వాసం ఉందని చెబుతున్నారని వెల్లడించారు.
చంద్రబాబుకు చూట్టుపక్కల వారు వాస్తవాలు చెప్పడం లేదని తెలిపారు. చదువుకున్న వారిలో మార్పు వచ్చిందే తప్ప పల్లెల్లో పేదల్లో మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ మాత్రమే అధికారంలో ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారని తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



