మాజీ ఎంపీ జేసీకి డ్రైవర్‌ టోకరా

మాజీ ఎంపీ జేసీకి డ్రైవర్‌ టోకరా
x
Highlights

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సూట్‌కేసులోని రూ.6లక్షలను కారు డ్రైవర్‌ కాజేశాడు. గవర్నరుపేట పోలీసులు అతన్ని ఆదివారం అరెస్టు చేశారు. వివరాలిలా...

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సూట్‌కేసులోని రూ.6లక్షలను కారు డ్రైవర్‌ కాజేశాడు. గవర్నరుపేట పోలీసులు అతన్ని ఆదివారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. జేసీ దివాకర్‌రెడ్డి ఈ నెల 11న హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం వచ్చారు. సొంత పని మీద కారులో సచివాలయానికి వెళ్లి తిరిగి 2.30 గంటల సమయంలో హోటల్‌కు చేరారు. కారులో ఉన్న సూట్‌కేసు తీసుకువచ్చి గదిలో పెట్టమని కారు డ్రైవర్‌ గౌతమ్‌కు చెప్పారు. డ్రైవర్‌ సూట్‌ కేసు తీసుకొచ్చి జేసీ బస చేసిన రూమ్‌లో పెట్టి వెళ్లిపోయాడు. సాయంత్రం 6 గంటల సమయంలో జేసీ దివాకర్‌రెడ్డి సూట్‌ కేసు చూసుకోగా అందులో ఉన్న రూ.6 లక్షలు కనిపించలేదు. డబ్బు లేకపోవడంతో షాక్‌ తిని పోలీసులకు ఫిర్యాదు చేశారు జేసీ. దర్యాప్తు చేసిన పోలీసులు డ్రైవర్‌ గౌతమ్‌పై అనుమానం రావడంతో విచారించగా అసలు నిజం బయటపెట్టాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories