Pawan Kalyan: నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

JanaSena Pawan Kalyan to Visakhapatnam Today
x

Pawan Kalyan: నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Highlights

Pawan Kalyan: రేపు జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్న పవన్

Pawan Kalyan: ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. మూడు పార్టీల కార్యక్రమాలతో విశాఖలో రాజకీయం వెడేక్కింది. ఒకవైపు విశాఖ గర్జన.. మరోవైపు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించడంతో తీరంలో హై టెన్షన్ నెలకొంది. ఇక మూడు రోజుల పాటు పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేయనున్నారు. జనసేన జనవాణి కార్యక్రమం పేరుతో ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఏర్పాట్లు చేసిన జనవాణికి భారీగా స్పందన వచ్చింది. విశాఖలో కార్యక్రమానికి భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఏర్పాట్లను మెగా బ్రదర్ నాగబాబు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయన విశాఖకు చేరుకున్నారు. తమ్ముడి పర్యటన ఏర్పాట్లలో భాగంగా విశాఖ చేరుకున్న పవన్‌కు.. స్థానిక కార్యకర్తలు, మెగా అభిమానులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories