జనసేనలో భిన్నాభిప్రాయాలు.. ప్రభుత్వ నిర్ణయానికి ఎమ్మెల్యే రాపాక మద్దతు

జనసేనలో భిన్నాభిప్రాయాలు.. ప్రభుత్వ నిర్ణయానికి ఎమ్మెల్యే రాపాక మద్దతు
x
ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
Highlights

ఇంగ్లీష్‌ మీడియంపై జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఆరవతరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతోంది.

ఇంగ్లీష్‌ మీడియంపై జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఆరవతరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతోంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా సమర్ధించారు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఇంగ్లిష్ అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యకు తాను పూర్తిగా మద్దతిస్తున్నాని రాపాక తెలిపారు. అయితే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. దీనివలన తెలుగు మరుగున పడిపోతుందని అన్నారు.

ఏపీ ప్రభుత్వం తెలుగును నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని గతంలో విమర్శించారు పవన్. ప్రభుత్వ నిర్ణయంపై ట్విట్టర్ ద్వారా రోజు దుమ్మెత్తిపోతున్నారు. అయితే ఈ విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుండటంతో దీనిపై పవన్ ఏమి చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా సీఎం జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం చేశారు. ఇదిలావుంటే ఇంగ్లీష్ విద్య విషయంలో మొదట్లో తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించినా ఆ తరువాత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories